జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం పవన్ జనసేన నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం, వారాహి వాహనంలో ప్రచారానికి బయల్దేరాలని పవన్ నిర్ణయించారు. 

పిఠాపురం నియోజవకర్గంలోనే మూడ్రోజులు ప్రచారం నిర్వహించనున్న పవన్… పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు.