రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. ములాఖత్ ద్వారా ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కలవబోతున్నారు. వీరితో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా బాబును కలవనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వీరు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. మరోవైపు భువనేశ్వరి, బ్రాహ్మణి ఈరోజు అన్నవరం ఆలయంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని, అక్రమ కేసు నుంచి బయటపడాలని దేవుడిని ప్రార్థించారు.