జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్ 1 తేదీ నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. పవన్ తదుపరి విడత వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైందని ఇందులో తెలిపారు.వారాహి విజయయాత్ర ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో నాదెండ్ల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది.