పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్… ఆ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ వెల్లడించారు. 

“చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి, విపక్ష నేతగా ఉన్నారు… ఆయన తన సుదీర్ఘ అనుభవంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో సీఈసీకి చక్కగా వివరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ఆయన శాయశక్తులా ఎలా కృషి చేశారో చెప్పారు. 

చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే వాటిలో నాలుగింట ఒక వంతు ఆమోదించారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక, జనసేన తరఫున కూడా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పాం. ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుండడంపై ప్రశ్నిస్తే విపక్షాల వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని వివరించాం.