సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ లకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇంతకుముందే నారవారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ నిన్న ఉండవల్లిలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ భోగిమంటలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతం చంద్రబాబు, లోకేశ్ స్వగ్రామానికి బయల్దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి వారు రోడ్డు మార్గంలో నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.