టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ నిన్న జాతీయ రహదారిపై ప్రయాణించినా సరే చెట్లు నరికేశారని ఆరోపించారు. జగన్ వస్తున్నాడంటే… ముందు గొడ్డలి వస్తుంది, ఆ తర్వాత జగన్ వస్తాడు అని ఎద్దేవా చేశారు. జగన్ ఫ్యాన్ తిరగడం మానేసింది… దాన్ని ప్రజలు తుక్కు తుక్కు చేసి చెత్తకుండీలో వేసేస్తారు… కావాలంటే గొడ్డలిని నీ సింబల్ గా పెట్టుకో… ప్రజలు నీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు… శని వదిలిపోతుంది అని వ్యాఖ్యానించారు.

“ఇంకా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం ఉంది. ప్రజాస్వామ్యం కాబట్టి జగన్ పదవిలో ఉంటాడంతే. ఏ పని చేయాలన్నా ఎన్నికల సంఘం చేయాల్సిందే.