నేడు జరగనున్న అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు అయోధ్యకు చేరుకోగా మరి కొందరు ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. 

అయోధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తరువాత ఈ కల సాకారమవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 

కాగా,  మధ్యాహ్నం 12.29 నిమిషాలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.