శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. కియా పరిశ్రమ ఎదురుగా ఉన్న స్థలంలో సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభతో ‘రా కదలిరా’ సభలు ముగియనున్నారు. ఈ సభల ద్వారా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల సభలు జరిగాయి. సభ నేపథ్యంలో అక్రడి భద్రతా ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ పరిశీలించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మతో చర్చించారు. ఈ సందర్భంగా పెనుకొండ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ కూడా అక్కడ ఉన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు కియా పరిశ్రమ కనిపించేలా వేదికను నిర్మించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సభా వేదిక వద్దకు చంద్రబాబు చేరుకుంటారు.