జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లోనూ, లాబీయింగ్ చేయడంలోనూ దిట్ట అనడానికి బెయిల్ కోసం సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆరోపించారు. జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే… అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. డబ్బు పిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనం అని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్ సోనియాను కలిశారన్న షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? అంటూ బొండా ఉమ నిలదీశారు.