తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చంద్రబాబు గారికే ఓటు వేశానని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చి, మేలు చేశారని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారని, దీంతో ఇది వైరల్ అయిందని.. కానీ అసలు మీరు అభిమానించే పార్టీ ఏది? అని ఓ యూట్యూబ్ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కుమారి ఆంటీ స్పందిస్తూ… తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎక్స్ సామాజిక వేదికపై ట్రెండింగ్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి ఆంటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని… జగన్ వచ్చాక వచ్చిన ఇల్లు మాత్రమే ఊళ్లో ఉందని చెప్పారు. తనకు ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. అయితే జగన్ తనకు ఇల్లు ఇచ్చిన అంశంపై నెట్టింట వైరల్‌గా మారింది. ఇదే సమయంలో మీరు అభిమానించే పార్టీ ఏది? అని మరో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అడిగితే తాను ఎప్పుడూ చంద్రబాబుకే ఓటు వేశానని చెప్పారు.