ఒక వైపు చంద్రబాబు అరెస్ట్.. మరోవైపు ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీలో గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ లాయర్లను కలుస్తూ కోర్టు వ్యవహారాలను చూసుకున్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు. తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యా పిల్లలను వదిలి ఢిల్లీకి పారిపోయిన పిరికి బడుద్దాయి అని లోకేశ్ పై కామెంట్ చేశారు. అంబటి వ్యాఖ్యలకు అదే స్థాయిలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తండ్రి కోసమేగా వెళ్లింది.. ‘అరగంట కోసం’ కాదుగా సోంబేరి సారు’ అని కౌంటర్ ఇచ్చారు.