లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచారు. వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలిజా (చింతలపూడి), ఆర్థర్ (నందికొట్కూరు)కు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కేటాయించింది. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్న సంగతి తెలిసిందే.