యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాల ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. నార్త్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడికి శ్రీలీల దగ్గర బంధువు అవుతుంది. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా వెల్లడించారు. అనిల్ తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ… శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పంగులూరు అని… తన అమ్మమ్మది కూడా అదే ఊరని ఆయన తెలిపారు. శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందని… అయితే బెంగళూరు, అమెరికాలో చదువుకుందని తెలిపారు. ప్రతి ఏటా పంగులూరుకు వస్తుంటుందని చెప్పారు. మరోవైపు సెట్స్ లో అనిల్ ను డైరెక్టర్ గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట.