పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి నిరసన సెగ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడికి ఈరోజు రాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు ఆయనను కలిశారు. అమరావతికి మద్దతు పలకాలని రాయుడిని కోరారు. తమ సమస్యలను వినాలని అభ్యర్థించారు. తమకు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, సమస్యలను వినాలని రైతులు కోరారు. అయితే తనకు సమయం లేదని, మీ సమస్యలను మరోసారి వింటానని చెపుతూ రాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాయుడుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల కోరిక మేరకు అంబటి రాయుడు అక్కడకు వెళ్లారు.

Previous articleమణిపూర్ అల్లర్లపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పిన కేఏ పాల్…
Next article1-8-2023TODAY E-PAPER