తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారీ ఒప్పందం ఉందని ఆయన అన్నారు. మణిపూర్ హింసపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంటే… ఆ అంశంపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా ఉందని… అందుకే కేసీఆర్ మౌనం దాల్చారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖాయమంటూ టీఎస్ బీజేపీ నేతలు ఊదరగొట్టేశారని.. ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయని… ఆ మలుపులు ఏమిటనేది రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా అంతు చిక్కలేదని చెప్పారు. కవితను అరెస్ట్ చేయకపోవడంతో… సొంత పార్టీపైనే బీజేపీ నేతలకు అనుమానాలు కలిగాయని అన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య ఒక అవగాహన కుదిరిందనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమయిందని చెప్పారు. మణిపూర్ అల్లర్ల వెనుక ప్రధాని మోదీ హస్తం ఉందని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో మారణహోమం జరిగినా ఇప్పటి వరకు సీఎంను, డీజీపీని తప్పించలేదని విమర్శించారు.