మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ సెట్స్ కి తమిళ సూపర్ స్టార్ అజిత్ అనుకోని అతిధిగా వచ్చి చురంజీవితో పటు చిత్ర యూనిట్ అందరినీ ఆశ్చర్యపరిచారు. చిరంజీవి , అజిత్ కలిసిన వేళ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోలో తన ‘విశ్వంభర’ సినిమా చిత్రీకరణలో ఉండగా అదే స్టూడియోలో ఇంకో పక్కన తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రీకరణ జరుగుతుండగా ‘విశ్వంభర’ సెట్స్ పైకి అజిత్ వచ్చి చిరంజీవిని ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తమిళంలో సూపర్ స్టార్ అజిత్ మొదటి సినిమా తెలుగులో వచ్చిన ‘ప్రేమ పుస్తకం’. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేక అతిధిగా చిరంజీవి వెళ్లారు. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత అజిత్ ఇలా చిరంజీవిని సినిమా సెట్స్ పై కలవటంతో , వాళ్లిద్దరూ ఎన్నో పాత విషయాలు మాట్లాడుకున్నారు. అజిత్ నటిస్తున్న ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రవిచంద్రన్ దర్శకుడు. . చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకి మల్లిడి వసిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సామాజిక మాధ్యమంలో అజిత్ తో వున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, అప్పటి సంగతులను నెమరువేసుకున్నారు. ‘ప్రేమ పుస్తకం’ సినిమా మ్యూజిక్ లాంచ్ తనే చేసానని , అలాగే అజిత్ భార్య షాలిని తను నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో బాలనటిగా చేసిందని చిరు అన్నారు. . ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇవన్నీ చిరంజీవి తన పోస్టులో ప్రస్తావిస్తూ, అజిత్ ఇప్పుడు పెద్ద స్టార్ అయినా ఎటువంటి భేషజం లేకుండా, సింపుల్ గా వున్నారని  చెప్పారు