ఏపీ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు శాఖల బాధ్యతలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన అధికారాలు చేపట్టిన మొదటి రోజే ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.. అయితే పంచాయతీ రాజ్ అధికారులకు డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వణుకు పుట్టిందని వార్తలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఆయన అడిగిన ప్రశ్నలలో ఉపాధి హామీ పథకంలో చెల్లింపుల ఆలస్యానికి కారణం ఎవరు అని అడిగారట.. ఇక రెండో ప్రశ్నగా పంచాయతీ రాజ్ కి సమాంతరంగా సచివాలయం ఏర్పాటు ఎందుకు అని పవన్ కళ్యాణ్ అడిగారట.. అసలు పంచాయతీలను నిర్వీర్యం చేసి సచివాలయాన్ని ముందుకు తీసుకురావటానికి కారణమేంటన్న పవన్ ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానం లేదని సమాచారం.. అంతే కాకుండా గ్రామ సర్పంచులకు పంచాయతీల పై నియంత్రణ లేకపోతే ఎలా..? ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా అధికారులను పవన్ కళ్యాణ్ అడిగినట్టు తెలుస్తోంది.. అయితే ఆయన అడిగిన ఏ ప్రశ్నకు కూడా అధికారుల నుండి సరైన సమాధానం రాలేదని సమాచారం.. ఈ కారణంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన దాంట్లో రాజకీయ నాయకుల పాత్ర కంటే అధికారుల పాత్ర ఎక్కువుందని ప్రజల నుండి విమర్శలు వచ్చాయి. ప్రజలకు చెందే ప్రతీ దాంట్లో అధికారులు కమిషన్ లు దండుకుంటున్నారని కూడా ఎన్నో వార్తలు వచ్చాయి.. ఇక ప్రజలతో ఎన్నుకోబడ్డ సర్పంచులకు అధికారాలు లేకుండా సచివాలయం ముఖ్య పాత్ర పోషించటం ఏంటని పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు సర్పంచులు హర్షం వ్యక్తం చేసినట్టు తెలిసింది.. పంచాయతీలకు ప్రాధాన్యతనిస్తూ,ఎవరి బాధ్యత వారు నిర్వహించాలని అధికారులకు పవన్ కళ్యాణ్సూ చించినట్టు సమాచారం.. ఇలా మొదటి రోజే పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది.. ముందు ముందు పవన్ కళ్యాణ్ ప్రజా సేవ విషయంలో ఎలా ఉండబోతున్నాడో మొదటి రోజే చూపించాడు.. ఆయన రాకతో ఏపీ కి మంచి రోజులు వచ్చాయని సామాన్య ప్రజానీకం అనుకుంటున్నారు.