హైదరాబాద్‌: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్టు షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. రాత్రి ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న 7 బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. రూ.1.56 లక్షల విలువ చేసే  142 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట పరిధిలో 71 లీటర్లు, దుండిగల్‌ పరిధిలో 24.24, చందానగర్‌లో 7.8, మియాపూర్‌లో 6.7 లీటర్లు, కొందుర్గులో 12.48 లీటర్లు, కడ్తాల్‌లో 8.10,  కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌ పరిధిలో 11.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.