బాలికపై అత్యాచారం చేసిన సీఐ.. పోక్సో కేసు నమోదు భీమారం ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సీఐగా పని చేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పని చేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగేవాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినా ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐగా బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సదరు మహిళ కూతురి(16)పై కన్నేశాడు. అదను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సంపత్పై అత్యాచారంతోపాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.