మాదాపూర్ డివిజన్ పరిధిలోని గురుకుల్ గట్కేసర్ ట్రస్ట్ భూములను  అయ్యప్ప సొసైటీ, చంద్యా నాయక్ తాండ, సర్వే ఆఫ్ ఇండియా గా మార్చి ఎవరికి తోచినట్టు వారు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. కోర్టు ఈ గురుకుల గట్కేసర్ ట్రస్ట్ భూములలో ఎలాంటి నిర్మాణాలు నిర్మించవద్దని తీర్పు ఇచ్చిన ఎవ్వరూ లెక్క చేయకుండా టౌన్ ప్లానింగ్ అధికారుల అండ దండలతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే  ఎలాంటి అనుమతులు లేకుండా సూర్య దినపత్రిక ఆఫీస్ పక్కన జి ప్లస్ 7 అంతస్తుల భారీ నిర్మాణం మరియు రోడ్ నెంబర్ 35  ప్లాట్ నెంబర్ 627 మరియు 619 లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న అధికారులు ఎవ్వరు పట్టించుకునే స్థితిలో లేరు. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఆదేశాలను కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అందుకు నిదర్శనం చందానగర్ సర్కిల్ 21 మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీ చంద్య నాయక్ తండ సర్వే ఆఫ్ ఇండియా లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల భాగోతమే. ముఖ్యంగా  ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల 150 నుండి 300 గజాల లో జి ప్లస్ 6 నుండి 8 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎవరు పడితే వారు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూన్న వారి నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు పట్టణ ప్రణాళిక విభాగం పై గుప్పు మంటున్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కాస్త అధికారుల జేబుల్లోకి వెళుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చందానగర్ సర్కిల్-21 పరిధిలో అయ్యప్ప సొసైటీ, చంధ్యనాయక్ తాండ సర్వే ఆఫ్ ఇండియా గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ భూముల్లో అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు ఏం చేస్తున్నారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం చందానగర్ సర్కిల్ లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టిన తిరిగి మళ్ళీ కిందిస్థాయి అధికారుల ప్రోద్బలంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వెనక టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీసర్, చైన్ మెన్ సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్కడ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp-Image-2024-03-26-at-7.02.24-PM-1-771×1024.jpeg