ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టింది. ఆమె కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. మరోవైపు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని… తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కవిత కోరారు. ఈ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది.