వరంగల్*:-కాకతీయ యూనివర్సిటీ పోలీస్టేషన్ లో గతంలో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి బండారు సంపత్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేయూ పోలీస్ అధికారి తెలిపారు. 2022 లో కేయూ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు పోలీస్ అధికారి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక మహిళతో అక్రమ సంబంధం ఇంకా కొనసాగిస్తున్నారన్న సమాచారంతో సదరు మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అప్పటి పోలీస్ కమిషనర్ సదరు పోలీస్ అధికారిని ఏఆర్ కు అటాచ్ చేశారు. ఆ తరువాతి క్రమంలో సదరు పోలీస్ అధికారి సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లారు. అయినా స్వభావం మానుకోని సదరు పోలీస్ అధికారి ఆ మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు, ఈ క్రమంలో సదరు మహిళా కూతురిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు, మహిళా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేయూ పోలీసులు విచారణ చేసి గురువారం రోజు సదరు అధికారి పై అత్యాచార యత్నం, ఫోక్సో కేసు క్రింద నమోదు చేసినట్లు తెలిపారు. అయితే కేయూ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు గత కొంతకాలంగా ఏదో ఒక ఆరోపణ నేపథ్యంలో సస్పెండ్ అవ్వడం ఈ కేయూ పోలీస్ స్టేషన్ వాస్తు ప్రకారం విధులకు కలిసి రావడం లేదని, పోలీసు శాఖలో ఈ పోలీస్ స్టేషన్ అంటేనే సస్పెండ్ అవుతాం అన్న భావన నెలకొంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు పలువురు భూకబ్జాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2022 లో సుబేదారి పీఎస్ పరిధి రాంనగర్ లో రవి అనే పోలీస్ అధికారి సహోద్యోగిని తో కలిసి ఆమె ఇంట్లోనే భర్త చేతిలో దొరికిపోవడం, దామెర పరిధిలో ఇద్దరు పోలీస్ అధికారులు దొరికిపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ చేదు సంఘటనలను మరవకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అయినా స్వభావం మార్చుకొని కొందరు క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. అయితే ఈ ఘటనలో కొసమెరుపు ఏమిటంటే సదరు మహిళ భర్త సరైన సమయం చూసి పకడ్బందీగా కేసులో ఇరికించిన ట్లు సమాచారం.