బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతి నగర్’లో నివాసముండే శ్రీకాకులం వాసి నాగరాజు గారు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ యువత నాయకులు వి.ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం ఏడు వేల రూపాయల(7,000/-) ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన యువ నేతకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శేఖర్ గారు, శ్రీను గారు, కిరణ్ గారు, ప్రవీణ్ గారు, గున్న రావు గారు, రామారావు గారు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.