జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్బంగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అయన సంచలన విషయాలు వెల్లడించాడు. .పిఠాపురం నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను అందరినీ కలవాలని భావిస్తానని, అయితే ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ఇటీవల తనను కలిసేందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు, వారిలో కిరాయి మూకలు కూదా చొరబడుతున్నాయని, సన్నటి బ్లేడ్లు ఉపయోగించి భద్రతా సిబ్బందిని కోసేస్తున్నారని, తనను కూడా కోశారని పవన్ వెల్లడించారు. మొన్న పిఠాపురంలో కూడా ఇది జరిగిందని తెలిపారు. అందువల్ల అందరినీ కలవలేకపోతున్నామని చెప్పారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు మీకు తెలుసు కాబట్టి, అందుకు తగినట్టుగా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.