తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది.అంతేకాదు కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 33గా ఉన్న జిల్లాల సంఖ్య.. దాదాపు సగానికి తగ్గించనున్నట్లు సమాచారం. . రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది సమాచారం. పార్లమెంట్ స్థానాలను జిల్లాలుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీంతో జిల్లాల సంఖ్య 17కు కుదించే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల అంశం పై త్వరలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటిస్తే.. ప్రస్తుతమున్న జిల్లాల్లో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దవుతాయి. . అయితే తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్య విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా 33 జిల్లాలు అవసరం లేదని, జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని కామెంట్స్ చేయటం విశేషం . . మరోవైపు జిల్లాలను తగ్గిస్తే ఎదుర్కోబోయే పరిణామాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే హెచ్చరించారు. ఇక ఏపీలో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించిన జగన్‌ సర్కార్ విభజన నాటికి 13 జిల్లాలుగా ఉన్నఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుతం 26 జిల్లాలుగా విభజించారు.