కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వాడీవేడిగా ప్రసంగించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ వైసీపీ నుంచి బయటికి వచ్చేసిన వాళ్లేనని, వారు నిజంగా జగన్ ను నమ్మారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటే అందరూ ఆలోచించాలని అన్నారు. గతంలో వైఎస్ వద్ద పనిచేసిన వ్యక్తి బాలశౌరి అని, తండ్రిని నమ్మినట్టే కొడుకును కూడా నమ్మారని, అంబటి రాయుడు కూడా అంతేనని., వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వైసీపీలో వ్యక్తులు అవసరం లేదని , వారికి బానిసలు మాత్రమే అవసరం అని పవన్ పేర్కొన్నారు. వారి మోచేతి అంబలి తాగాలి, అలాంటి బానిసత్వం చేసినవారే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతారు… అంటూ విమర్శించారు. మనం మనుషులమని , రాజ్యాంగం మనకు హక్కులు కల్పించిందని ,కానీ ఈ వైసీపీ ఆత్మగౌరవం తీసేస్తోందని అన్నారు. “కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి బాలశౌరి అని , ఒక కార్యకర్త మీద వైసీపీ వాళ్లు చేయి చేసుకుంటే వీర సింగంలా తిరగబడి కార్యకర్తలకు, జనసైనికులకు బలం ఇచ్చాడని , అలాంటి నాయకుడ్ని బందరు పార్లమెంటు నుంచి బరిలో దింపానని చెప్పారు. ఇక కొనకళ్ల నారాయణ గారు… రాష్ట్ర విభజన సమయంలో ఒక సింహంలా పోరాడిన వ్యక్తని , నాడు కాంగ్రెస్ నేతలపై పార్లమెంటులో తొడకొట్టి మరీ పోరాడారని,గుర్తు చేశారు . ఆయనపై దాడి జరిగితే కదిలిపోయానని ,. నాడు జరిగిన దాడి కొనకళ్ల మీద కాదు, టీడీపీ మీద కాదు… ఆంధ్రుల మీద జరిగిందన్నారు. . కొనకళ్ల ఇవాళ పెద్ద మనసుతో ఎంపీ టికెట్ ను బాలశౌరికి ఇచ్చేందుకు అంగీకరించారని , జన్మలో దీన్ని మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. . కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య వంటి మహనీయుడు పుట్టిన నేల ఇదని , రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే మేం బెదిరిపోమని , తప్పులు చేస్తే తాట తీస్తామంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. దమ్ము ధైర్యం లేకపోతే బతకలేని ఈ సమాజంలో బతకలేమని ,రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందని అన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మన బతుకులు నలిపేసే హక్కు జగన్ కు లేదని పవన్ మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి బాలశౌరి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి వాళ్ళిద్దరినీ గెలిపించండి” అని పవన్ కల్యాణ్ కోరారు.