జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రి రేపటి నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగసభ జరగనుంది. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.

Previous articleచంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై కల్వకుంట్ల కవిత స్పందన
Next articleఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్న హరీశ్ రావు