టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పార్టీలకు అతీతంగా ఎందరో నేతలు ఖండిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా బాబు అరెస్ట్ సక్రమం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ వయసులో ఆయనను ఇలా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు… ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి కూడా మంచి మాటలు చెప్పారని అన్నారు. మరోవైపు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Previous articleమధ్యాహ్నం విజయవాడకు చేరుకోనున్న పవన్.. రేపటి నుంచి టీడీపీతో కలిసి వారాహి యాత్ర
Next articleఢిల్లీలో రేపు లోకేశ్ ఒక రోజు నిరాహార దీక్ష