ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నియోజకవర్గానికి ఒకటే టిక్కెట్, ఒకటే బీఫామ్ ఉంటుందన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ… పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అందరూ కలిసికట్టుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ ఆశలు, నేతల మధ్య విబేధాలు అన్నీ పక్కన పెట్టి, అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలన్నారు. అందరం కలిసి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.

Previous articleకాంగ్రెస్‌కు నాయకుల్లేరు, బీజేపీకి కేడర్ లేదు…
Next articleడీకే అరుణ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్