బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను జగిత్యాలలో ఆడబిడ్డలతో కలసి బతుకమ్మ పండుగ చేసుకోవడానికి వచ్చానని… ఈ సందర్భంగా తన గురించి అర్వింద్ అసభ్యకరంగా, అభ్యంతరకంగా వ్యాఖ్యలు చేశారని వారు తనతో చెప్పారని అన్నారు. తాను నిజమాబాద్ లో ఓడిపోయిన తర్వాత కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నానని… కానీ, గెలిచిన అర్వింద్ మాత్రం ఎంపీగా బాధ్యతలను విస్మరించి, తనపై అనేక రకాలుగా మాట్లాడారని విమర్శించారు.  తాను కేసీఆర్ బిడ్డను కాబట్టి, ఏది పడితే అది మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని… ఇలాంటి మాటలే తాము మీ ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే మీరు భరించగలరా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు కూడా ఎప్పుడూ ఇంత దారుణంగా మాట్లాడలేదని చెప్పారు. అర్వింద్ వంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన సమయం వచ్చేసిందని కవిత వ్యాఖ్యానించారు.