గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని పలు కాలనిలో లోతట్టు ప్రాంతాలను బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ వెళ్లి పరిశీలించారు ప్రధానంగా బసవతారక నగర్ లోని గుడిసెలు మునిగిపోయా యని తెలుసుకొని మునిగిన ఇళ్లను సందర్శించి వారితో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ ఇల్లు కూలగొట్టారని పాములు తేళ్లు అడవి పందులు సైతం సంచరిస్తున్నాయని అద్వానమైన స్థితిలో ఉన్నామని తమ సమస్యలను పరిష్కరించాలని బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు అదేవిధంగా కనీసం తమకు డబల్ బెడ్ రూములు ఇల్లు వచ్చే విధంగా చూడాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గంగారం సంగారెడ్డి,ప్రభాకర్, సత్య రెడ్డి, సాయన్న , వై వి రమణ మరియు బిఆర్ యువసేన నేతలు కిషోర్ రెడ్డి సందీప్ రెడ్డి సునీల్ రెడ్డి అక్షయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.