షారుక్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘జవాన్’ సినిమా రుపోయిందిన విషయంమన అందరికి తెలిసిందే. షారుక్ సునీత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. ఈ నెల 7వ తేదీన హిందీ .. తమిళ .. తెలుగు భాషల్లో విడుదలైంది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది.ఈ సినిమా ఇంతవరకూ 953.97 కోట్లను వసూలు చేసింది. వెయ్యికోట్ల మార్క్ ను టచ్ చేయడానికి చేరువలో ఉంది. చాలా వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఇది ఒకటిగా చేరింది. షారుక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, దీపికా పదుకొణె … నయనతార .. విజయ్ సేతుపతి .. ప్రియమణి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు. అట్లీ తయారు చేసుకున్న కథాకథనాలు .. ప్రధానమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు .. అనిరుధ్ అందించిన సంగీతం .. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయని అంటున్నారు. షారుక్ కి ‘పఠాన్’ తరువాత ఈ స్థాయి హిట్ పడటం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.