ఈ రోజు తుక్కుగూడలో జరిగే సభలో సోనియా గాంధీ ప్రకటించే ఆరు గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ రెండో రోజు సమావేశాలు ముగిసిన తర్వాత సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలంతా నేరుగా బహిరంగ సభకు చేరుకుంటారు. కాంగ్రెస్ విజయభేరి సభకు రాష్ట్ర నాయకత్వం పది లక్షల మందిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ సభలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారు. 6 హామీల గ్యారంటీ కార్డు విడుదల చేయనున్నారు.

Previous articleదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ…
Next articleఅమిత్ షా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపాటు