ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది .. ఆ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైన తర్వాత వైఎస్సార్‌సీపీ వరుసగా సమీక్షలు చేస్తోంది.. అయితే ఆ పార్టీకి ఇప్పుడు వరుసగా తలనొప్పులు వెంటాడుతున్నాయి. కొందరు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇదివరకే మాజీ మంత్రులు శిద్దా రాఘరావులు, రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి విడదల రజిని కూడా వైసీపీ పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. జాతీయ పార్టీ నేతలతో రజిని చర్చ జరిపినట్లు సమాచారం . అయితే రజిని అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని , ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమేనని వైఎస్సార్‌సీపీ వర్గాలు అంటున్నాయి .. . ఈ ఎన్నికల్లో విడదల రజిని ఓటమి తర్వాత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిని కూడా కలిశారని , నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు . అంతేకాదు సోమవారం రోజు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ కూడా షేర్ చేశారని కాబట్టి ఆమె పార్టీ మారడం లేదని కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విడదల రజిని స్పందించాల్సి ఉంది.