తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ సమయానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఓటర్లను మాత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. మరోవైపు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ వెలువడితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని ఇంతకు ముందే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ సమయాన్ని ఈసీ సవరించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించవచ్చని తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ సాయంత్రంతో తెలంగాణలో కూడా పోలింగ్ పూర్తి కానుండటంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.