తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు. ఓటు వేసిన తర్వాత ఆయన తిరుగుపయనమయ్యారు. మరోవైపు, కేసీఆర్ వచ్చేంత వరకు ఓటు వేసేందుకు రాని చింతమడక ఓటర్లు… ఆయన వచ్చే సమయానికి పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. ఆయనతో కలిసి ఓటు వేసేందుకు క్యూకట్టారు. కేసీఆర్ ను చూసేందుకు ఓటర్లు బారులు తీరారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ ఓటర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు కొందరు మహిళలు ప్రయత్నించగా… భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.