ప్రముఖ సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ స్టేషన్‌లో ఆయన వరుసలో నిలబడి ఓటు వేశారు. అల్లు అర్జున్ వరుసలో నిలబడినప్పుడు మీడియా కెమెరాలు ఆయనను చుట్టుముట్టాయి. ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరిచారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ దంపతులు ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

బీఎస్ఎన్ఎల్ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన అల్లు అర్జున్ ఓ యువతితో సరదాగా మాట్లాడారు. నీకు బాగా ఫాలోవర్స్ కావాలని మంచి వీడియో తీస్తా.. ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అని అడిగారు. తనకు పదమూడు వేలమంది ఫాలోవర్స్ ఉన్నారని ఈ సంఖ్య 30వేలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ స్పందిస్తూ ఫాలోవర్స్ సంఖ్య పెరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.