శేరిలింగంపల్లి మియాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్: నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ నన్ను ప్రకటించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా తరుపున మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యత తో రెట్టింపు ఉత్సహం తో పనిచేసి ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి నా వంతు శయాషెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. నా వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు , వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు , కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు నా హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నానని మీ అందరి ఆశీస్సుల తో , మీ సహాయ సహకరాలతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను కేసీఆర్, కేటీఆర్ ల సహకారం తో 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని,మీ అందరి ఆశీస్సులతో, సహకారంతో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలిచి మీ అందరి ఆశీస్సులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.