స్కిల్ కేసులో సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.అయితే, ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య తీర్పులో ఏకాభిప్రాయం కుదరలేదు. విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ పేర్కొనగా, చంద్రబాబుకు 17ఏ వర్తింపజేయలేరని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు  ఈ కేసు విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనం ముందుకు ప్రతిపాదించింది. ఇరువురు న్యాయమూర్తుల తీర్పులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.