దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు అధ్యక్షుడు బ్రెండి బోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొనెన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్య వృద్ధి వంటి అవకాశాలపై చర్చించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో అడుగుపెట్టిన సీఎం రేవంత్ బృందం పలుదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో ఒప్పందాలు చేసుకోనుంది. అలాగే, నోవార్టిస్, ఆస్ట్రాజనిక్, గూగుల్, మెడ్‌ట్రానిక్స్, మాస్టర్‌కార్డ్, ఉబెర్, ఎల్డీసీ, బేయర్, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ భేటీ అవుతారు. మన దేశానికే చెందిన టాటా, విప్రో, జేఎస్‌డబ్ల్యూ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎయిర్‌‌టెల్, గోద్రెజ్, బజాజ్, నాస్కాం, సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.