Sobhita Dhulipala

ప్రముఖ నటుడు నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ప్రశ్న ఎదుర్కొంది. ఈ సందర్భంగా చెబుతూ, తన వ్యక్తిగత జీవితంపై అనవసర వాగుడుని తాను పట్టించుకోనని బదులిచ్చింది. అసలు ఏముందని బాధ పడడానికి? అంటూ ప్రశ్నించింది. 

‘‘నేను ఇది చెప్పకపోతే దీనిపై ప్రజలు తెలుసుకోవడానికి అవకాశమే ఉండదు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ప్రతి దశలోనూ ఎంతో కష్టపడ్డాను. మీరు నన్ను చూడాలనుకుంటే, లేదా నా గురించి తెలుసుకోవాలంటే నా ప్రతిభను చూడాలని కోరతాను. నా శ్రమను చూడాలని కోరతాను. అది నాకు ఎంతో అమూల్యమైనది. అంతే కానీ, వారు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఏమిటి?’’ అని శోభిత చెప్పింది. తన నటన గురించి మాట్లాడాలే కానీ, తన వ్యక్తిగత జీవితంలోకి చూడొద్దని శోభిత ఒక విధంగా అభిమానులను కోరినట్టయింది. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు.. ఒదిగి ఉండే వాడు తనకు కావాలంది. తనకు నన్నిహితంగా ఉంటూ, అర్థం చేసుకునేవాడు కావాలని తెలిపింది.

Previous article ఆసియాలోనే అతి పెద్ద ఇళ్ల గృహ సముదాయం
Next articleవిపక్షాల ఐక్యత కోసం జూన్ 23న కీలక భేటీ