శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ జరిగింది. విద్యార్థులకు పుస్తకాలకు మధ్య వారధి లాంటిది. రఘునాథ్ ఫౌండేషన్ చేర్మన్ రఘునాథ్ యాదవ్ గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఉచితంగా స్కూల్ బ్యాగ్ పంపిణీ చేయాలనే ఆలోచనతో మియాపూర్ డివిజన్ లోని ఉన్నత పాఠశాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలోనీ ప్రతి విద్యార్ధికి మా ఫౌండేషన్ ద్వారా స్కూల్ బ్యాగ్ ఉచితంగా అందిస్తామని అంతే కాకుండా 10వ తరగతి ఫలితల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ఐదు మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు ఫౌండేషన్ తరపున ఉద్యోగంలో చేరేవరకు పూర్తి సహాయ సహకారం ఉంటుందని హామీఇచ్చారు. చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో అయినా చాలా చక్కటి క్రమశిక్షణతో మెలగాటంతో విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసుందర గారిని మరియు పాఠశాల బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కుమార్ సాగర్, భారత్ యాదవ్, ఉదయ్ బాక్సర్, పవన్, పులికొండ రాజు, శ్రీకాంత్ నాయక్, కిరణ్ రెడ్డీ, రాజేష్, సురేష్, రవి, శ్రీను, జావీద్, అరుణ్, అఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.