దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇందులో 15లక్షల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరుకాక మరో 8లక్షల మందికి పైగా తాత్కాలిక కార్మికులు న్నారు.రైల్వేను అత్యవసర వ్యవ స్థగా పరిగణిస్తారు. దీర్ఘకా లంగా రైల్వే ఉద్యోగులు తమకూ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరు తున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల సమయంలో వీరికి ఆ అవకాశం దక్కింది.ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. ఒక్క ఓటే జయాప జయాల్ని తలక్రిందులు చేసిన సందర్భాలున్నాయి. భారతీయ పౌరులందరికీ ఓటు వినియోగించుకోవడం హక్కే కాదు.. బాధ్యత కూడా. అయితే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రానికెళ్ళి ఓటేయడం కుదరదు. అలాంటివారి కోసం ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఇప్పటివరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితోపాటు కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ను అనుమతించారు. కానీ ఈసారి ఏకంగా 33 అత్య వసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్.