* వైసీపీ నుంచి జనసేనలో చేరిక
విశాఖ జిల్లా, పెందుర్తికి చెందిన మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గురువారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి రమేష్ బాబుని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరేందుకు వందలాది మంది అభిమానులతో కలసి విశాఖ నుంచి భారీ ర్యాలీగా రమేష్ బాబు కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. జీవితకాలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. రమేష్ బాబు మా ఇంట్లో వ్యక్తి లాంటి వారని, పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.