టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలు తీవ్ర రూపం దాలుస్తున్నారు. ఈరోజు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్షను చేపట్టాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీలో నిరసన దీక్షలో కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర కుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి కూడా హజరై లోకేశ్ కు సంఘీభావం ప్రకటించారు.