pawankalyan

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలను డిఫెండ్ చేసుకోవడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. దాన్ని పొలిటికల్‌గా మరింత క్యాష్ చేసుకోవడంలో బీజేపీ అంతకంటే దారుణంగా ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు పవన్ వాటిని నేరుగా ప్రస్తావించకుండా కేసులు ప్రస్తావిస్తూ షా కామెంట్స్ నిజమే అని చెబుతున్నారు. సర్పవరం జంక్షన్ వద్ద జరిగిన సభలో చాలా విషయాలు ప్రస్తావించారు  పవన్. ముఖ్యమంత్రి ‌Jagan కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామిగా ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా దందాలు, గంజాయి, మట్కా, అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బినామిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ప్రత్యేక ఫైల్ కేంద్రం వద్ద ఉందని అన్నారు. మరోవైపున క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలను కూడ పవన్ వివరించారు. అమ్మాయిల మిస్సింగ్‌ కేసులకు  సంబంధించిన అంశాలు, ట్రైబల్ ఏరియాల్లో అమ్మాయిల ట్రాఫికింగ్ వంటి అంశాలు పవన్ ప్రస్తావించారు. అమ్మాయిల మిస్సింగ్‌కు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో రికార్డులను పవన్ చదివి వినిపించారు. కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారంపై bjp నేతలు స్పందించకపోయినా పవన్ స్పందిస్తుండటం చర్చనీయాంశమైంది.