ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌నే మార్చేసిన సినిమా పుష్ప అని చెప్పవచ్చు . 2021లో రిలీజైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అయ్యింది . ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఊహించని విధంగా హిట్ అయింది. ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపించింది. ఎక్కడ విన్నా ‘తగ్గేదేలే’ అనే పుష్ప డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇక పుష్ప క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మేనరిజం అన్నీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భుజం పైకెత్తి నడిచే సీన్ అయితే విపరీతంగా నచ్చేసిందనే చెప్పాలి . అయితే శ్రీహరికి నటించిన ఓ వీడియోను పుష్పకి లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అసలు దీనికి పుష్పకి సంబంధమేంటో ఓ సారి గమనిస్తే ఈ వీడియో క్లిప్ శ్రీహరి నటించిన’పృథ్వీ నారాయణ అనే మూవీలోది. ఇందులో శ్రీహరి నడుస్తూ వచ్చే స్టైల్, నిలబడే విధానం అన్నీ ‘పుష్ప’లో అల్లు అర్జున్ లానే ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 2002లో వచ్చిన ‘పృథ్వీ నారాయణ’ అనే సినిమాలోశ్రీహరి డబుల్ రోల్ చేశారు. అందులో ఒక పాత్ర మేనరిజం అచ్చం ఇప్పుడు వచ్చిన పుష్ప మూవీలో ఉండటంతో పుష్ప మేనరిజం 19 ఏళ్ల కింద శ్రీహరి చేశారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు పుష్ప మేనరిజం కాపీ కొట్టారా అంటున్నారు. ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే పుష్పలో భుజం పైకెత్తి నడిచే మేనరిజం తెలుగు ఆడియన్స్‌కి కొత్త కావచ్చు. కానీ మాలీవుడ్‌ సూపర్ స్టార్ మోహన్ లాల్ వాకింగ్ స్టైల్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ఆయన నార్మల్‌గానే భుజం పైకెత్తి నడుస్తూ ఉంటారు. అలా అని చెప్పి పుష్ప మేనరిజం కాపీ అని అనడానికి లేదు. ఏది ఏమైనా పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.