ponguleti srinivas jupally krishna rao
ponguleti srinivas jupally krishna rao

అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు.అదే సమయంలో కాంగ్రెస్ జూలు విదిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా- ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు.

కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయాన్ని వారిద్దరూ ఈ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వారిని స్వయంగా కలుస్తారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన దేశ రాజధానిలో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో షర్మిల సైతం త్వరలోనే కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.