పిఠాపురం పర్యటనలో ఉండగా జ్వరం బారిన పడిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాంతాల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. జ్వరం నుండి కోలుకుని మళ్ళీ ప్రచారం ప్రారంభించిన జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. ఆదివారం అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.పవన్ పర్యటన రద్దుకావడం ఇదే తొలిసారి కాదు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్బంగా అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత పవన్ మళ్ళీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.