జనేసేన అధినేత పవన్ విశాఖకు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయింది. బేగంపేట విమానాశ్రయంలోనే విమానం ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వమే కుట్ర పూరితంగా పవన్ పర్యటనను అడ్డుకుందని జనసేన ఆరోపించింది. పవన్ రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని ఆపేసినట్టు తమకు సమాచారం వచ్చిందని జనసేన నేత కేవీఎస్ఎస్ రాజు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా పవన్ విశాఖకు రావడం ఖాయమని అన్నారు. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు పవన్ నష్టపరిహారం అందిస్తారని చెప్పారు.